సీఐ వేధింపుల వల్లే గుండెపోటు: ఏఎస్సై | kachiguda ASI hospitalized due to heart attack | Sakshi
Sakshi News home page

సీఐ వేధింపుల వల్లే గుండెపోటు: ఏఎస్సై

Published Thu, Jul 27 2017 2:23 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

kachiguda ASI hospitalized due to heart attack

హైదరాబాద్‌: పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్‌ అధికారి గుండెపోటుకు గురయ్యారు. నగరంలోని కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న సుందర్‌ బుధవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. దీంతో తోటి సిబ్బంది ఆయనను నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు.
 
సీఐ వేధింపులతోనే తాను అనారోగ్యానికి గురైనట్లు సుందర్‌ తెలిపారు. సీఐ తనపై పని ఒత్తిడి పెంచడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిస్థితి ఇలా కావడానికి కారణమైన సీఐ పై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement