♦ ఎంసెట్ తేదీ మార్పుతో మారిన పరీక్ష కేంద్రాలు
♦ కార్బన్‌లెస్ కాపీల ముద్రణకు వీలుకాని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 15న జరగనున్న ఎంసెట్ పరీక్షలో విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఈసారికి ఇచ్చే అవకాశం లేదు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ మే 2న జరిగితే విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. కానీ ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో పరీక్షను ఈ నెల 15కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష తేదీతోపాటు కేంద్రాలూ మారాయి.
ఫలితంగా ఓఎంఆర్ జవాబు పత్రాలను మార్పు చేసి, మళ్లీ కొత్తగా ముద్రించాల్సి వచ్చింది. వాటితోపాటు కార్బన్‌లెస్ కాపీని ముద్రించడం కష్టమని ముద్రణ సంస్థలు తేల్చాయి. దీంతో ఈసారికి విద్యార్థులకు కార్బన్‌లెస్ కాపీ ఇవ్వకుండానే పరీక్షల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరీక్ష పూర్తై 3 రోజుల్లోనే ఓఎంఆర్ జవాబు పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు తెలిపారు. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదన్నారు.
‘కార్బన్‌లెస్’ పత్రం ఈసారికి లేదు!
Published Thu, May 5 2016 3:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM
Advertisement
Advertisement