EAMCET examination
-
తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్ష
-
రేపే తెలంగాణ ఎంసెట్ పరీక్ష
-
ఎంసెట్‌కు రంగం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా, నగర పరిధిలో 11 కేంద్రాలను కేటాయించారు. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఇంజినీరింగ్, 25న అగ్రికల్చర్, మెడికల్ వారికి, 24, 25 తేదీల్లో ఈ రెండూ రాసే వారికి అవకాశం కల్పించారు. విశాఖ జిల్లా నుంచి మొత్తం 25,028 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజినీరింగ్ 19,084, అగ్రికల్చర్, మెడికల్లకు 5,944 మంది హాజరుకానున్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు స్లాట్లను ఇచ్చారు. వీరు పరీక్షా సమయానికి గంట ముందుగా కేంద్రానికి చేరుకోవలసి ఉంటుంది. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, దరఖాస్తు నకలుపై అంటించిన ఫొటోపై అటస్టేషన్ కాపీ, ఎస్సీ, ఎస్టీలైతే కులధృవీకరణ పత్రం నకలు, నలుపు, నీలం రంగు పెన్నులను అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. రఫ్‌కు అవసరమైన పేపర్లను కేంద్రంలో నిర్వాహకులే ఇస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో 160 బిట్ ప్రశ్నలకు (160 మార్కులకు) సమాధానం రాయాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి 40 బస్సులు అదనంగా నడపనుంది. -
‘కార్బన్‌లెస్’ పత్రం ఈసారికి లేదు!
♦ ఎంసెట్ తేదీ మార్పుతో మారిన పరీక్ష కేంద్రాలు ♦ కార్బన్‌లెస్ కాపీల ముద్రణకు వీలుకాని పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 15న జరగనున్న ఎంసెట్ పరీక్షలో విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఈసారికి ఇచ్చే అవకాశం లేదు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎంసెట్ మే 2న జరిగితే విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. కానీ ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో పరీక్షను ఈ నెల 15కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో పరీక్ష తేదీతోపాటు కేంద్రాలూ మారాయి. ఫలితంగా ఓఎంఆర్ జవాబు పత్రాలను మార్పు చేసి, మళ్లీ కొత్తగా ముద్రించాల్సి వచ్చింది. వాటితోపాటు కార్బన్‌లెస్ కాపీని ముద్రించడం కష్టమని ముద్రణ సంస్థలు తేల్చాయి. దీంతో ఈసారికి విద్యార్థులకు కార్బన్‌లెస్ కాపీ ఇవ్వకుండానే పరీక్షల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పరీక్ష పూర్తై 3 రోజుల్లోనే ఓఎంఆర్ జవాబు పత్రాలను వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదన్నారు. -
విజయవాడలో ఎంసెట్ రద్దీ
► తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు ► ప్రశాంతంగా పరీక్ష ► మండుటెండలో విద్యార్థుల అవస్థలు ► కిటకిటలాడిన బస్‌స్టేషన్ విజయవాడ : ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో విజయవాడలో రద్దీ నెలకొంది. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. ఎంసెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల, వారి తల్లిదండ్రులు కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల్లో వేలాది తరలిరావడంతో మధ్యాహ్నం, సాయంత్రం రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇంజినీరింగ్ పరీక్ష ముగి శాక ఇంటికి వెళ్లేవారు, మెడిసిన్ పరీక్ష రాసేందుకు వచ్చేవారితో ట్రాఫిక్ రీద్దీ ఏర్పడింది. బందరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, ఏలూరు రోడ్డు ట్రాఫిక్ వల యంలో చిక్కుకున్నాయి. కొన్ని సెంటర్ల వద్ద చివరి క్షణాల్లో విద్యార్థులు పరుగులు తీసి పరీక్షహాళ్లకు చేరుకున్నారు. విజయవాడ రీజన్లో 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 22,405 మంది హాజరవగా, 842 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ పరీక్షకు 18,984 మందికి 18,481 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 96.37 శాతం, మెడిసిన్‌లో 97.35 శాతం మంది హాజరయ్యార కో-ఆర్డినేటర్ రత్నప్రసాద్ చెప్పారు. సకాలంలో హాజరైన విద్యార్థులు ఎంసెట్ ప్రవేశ పరీక్షకు క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు మందుగానే ప్రకటించడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 86 పరీక్ష కేంద్రాల పరిధిలో 15 మంది ప్రత్యేక పరిశీలకులు, 48 మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, 48 మంది పరిశీలకులు, 1760 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. పరీక్ష హాళ్లలోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతించకపోవడంతో సిద్ధార్థ, లయోల కళాశాలల వద్ద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎండ తీవ్రతతో ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని చెట్ల కింద, కాలేజీలు ఏర్పాటుచేసిన షామినాయాల కింద సేదతీరారు. 400 ఉచిత బస్సులు ఎంసెట్ పరీక్షలకు నగరంలో నడుస్తున్న 400 సిటీ బస్సులలో విద్యార్థులను ఉచితంగా అనుమతించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 40 బస్సులు నడిపామని పేర్కొన్నారు. అయితే పరీక్షల సమయంలో ఈ బస్సులు నామమాత్రంగా నడిచాయని విద్యార్థులు ఆరోపించారు. కొందరు కండక్టర్లు తిరుగుప్రయాణంలో టికెట్లు కొట్టి చార్జీలు వసూలు చేశారని తెలిపారు. బస్టాండు, రైల్వే స్టేసన్ కిటకిట ఎంసెట్ పరీక్షలు ముగిసి కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో సిటీ బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ రద్దీగా మారాయి. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ వెళ్లే విద్యార్థులు బస్సులు, రైళ్ల కోసం ఎగబడ్డారు.