విజయవాడలో ఎంసెట్ రద్దీ | Vijayawada EAMCET rush | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఎంసెట్ రద్దీ

Published Sat, Apr 30 2016 4:44 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

విజయవాడలో ఎంసెట్ రద్దీ - Sakshi

విజయవాడలో ఎంసెట్ రద్దీ

తప్పని ట్రాఫిక్ ఇక్కట్లు
ప్రశాంతంగా పరీక్ష
మండుటెండలో విద్యార్థుల అవస్థలు
కిటకిటలాడిన బస్‌స్టేషన్

 
విజయవాడ : ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో విజయవాడలో రద్దీ నెలకొంది. రోడ్లన్నీ వాహనాలతో కిటకిటలాడటంతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పలేదు. ఎంసెంట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల, వారి తల్లిదండ్రులు కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల్లో వేలాది తరలిరావడంతో మధ్యాహ్నం, సాయంత్రం రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఇంజినీరింగ్ పరీక్ష ముగి శాక ఇంటికి వెళ్లేవారు, మెడిసిన్ పరీక్ష రాసేందుకు వచ్చేవారితో ట్రాఫిక్ రీద్దీ ఏర్పడింది. బందరురోడ్డు, ఐదో నంబరు రోడ్డు, ఏలూరు రోడ్డు ట్రాఫిక్ వల యంలో చిక్కుకున్నాయి. కొన్ని సెంటర్ల వద్ద చివరి క్షణాల్లో విద్యార్థులు పరుగులు తీసి పరీక్షహాళ్లకు చేరుకున్నారు. విజయవాడ రీజన్‌లో 86 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 22,405 మంది హాజరవగా, 842 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ పరీక్షకు 18,984 మందికి 18,481 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 96.37 శాతం, మెడిసిన్‌లో 97.35 శాతం మంది   హాజరయ్యార కో-ఆర్డినేటర్ రత్నప్రసాద్ చెప్పారు.


 సకాలంలో హాజరైన విద్యార్థులు
ఎంసెట్ ప్రవేశ పరీక్షకు క్షణం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు మందుగానే ప్రకటించడంతో విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 86 పరీక్ష కేంద్రాల పరిధిలో 15 మంది ప్రత్యేక పరిశీలకులు, 48 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 48 మంది పరిశీలకులు, 1760 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు. పరీక్ష హాళ్లలోకి వాటర్ బాటిళ్లను కూడా అనుమతించకపోవడంతో సిద్ధార్థ, లయోల కళాశాలల వద్ద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసెట్ పరీక్షకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎండ తీవ్రతతో ఇబ్బందిపడ్డారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని చెట్ల కింద, కాలేజీలు ఏర్పాటుచేసిన షామినాయాల కింద సేదతీరారు.


400 ఉచిత బస్సులు
ఎంసెట్ పరీక్షలకు నగరంలో నడుస్తున్న 400 సిటీ బస్సులలో విద్యార్థులను ఉచితంగా అనుమతించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మరో 40 బస్సులు నడిపామని పేర్కొన్నారు. అయితే పరీక్షల సమయంలో ఈ బస్సులు నామమాత్రంగా నడిచాయని విద్యార్థులు ఆరోపించారు. కొందరు కండక్టర్లు తిరుగుప్రయాణంలో టికెట్లు కొట్టి చార్జీలు వసూలు చేశారని తెలిపారు.

బస్టాండు, రైల్వే స్టేసన్ కిటకిట
ఎంసెట్ పరీక్షలు ముగిసి కార్పొరేట్ కాలేజీల విద్యార్థులు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో సిటీ బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ రద్దీగా మారాయి. విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలు, తెలంగాణ వెళ్లే విద్యార్థులు బస్సులు, రైళ్ల కోసం ఎగబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement