రాష్ట్రపతిని ఆహ్వానించిన కేసీఆర్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు న్యూఢిల్లీలో కలిశారు. వచ్చే ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో జరిగే ఓయూ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతితో జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కేశవ్ రావ్, సీతారాం నాయక్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు.