
'మెరుగైన పాలనా విధానాలు అవలంబిస్తాం'
హైదరాబాద్: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రం నగరాల్లో, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న మున్సిపల్ పాలనా విధానాలపై తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని అస్కి ఆధ్వర్యంలో చాలా బాగా నిర్వహించారని ఆయన కొనియాడారు. శనివారం అస్కీ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర పట్టణాల్లో బహిరంగ మలమూత్రం చేసిన విధానం, ఢిల్లీ తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, నాగపూర్ నగర 24 గంటల మంచినీటి సరఫరా చేయడంపై అక్కడి అధికారులు వివరాలు ఇచ్చారని చెప్పారు.
చెన్నైలో బాండ్ జారీ చేసి.. నిధుల సేకరణపై, బెంగళూరు టెండర్ ష్యూర్ విధానంపై పరిశోధన చేసి హైదరాబాద్‌లో మంచి మున్సిపల్ పాలనా విధానాలు అవలంబిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మార్చి మొదటివారంలో జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలో నగర ప్రాజెక్టులపై సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.