సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు హైసెక్యూరిటీ ఫీచర్లతో పాస్ పుస్తకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ యోచన సందిగ్ధంలో పడింది. అధునాతన పాస్ పుస్తకాల ముద్ర ణపై ప్రైవేటు కంపెనీలు స్పందించకపో వడం, ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లు కూడా ముందుకు రాకపోవడంతో.. పాత తరహా పుస్తకాలతోనే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొన్ని సెక్యూరిటీ ఫీచర్ల ను తగ్గించి పాస్ పుస్తకాలను ముద్రించే దిశ గా ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో రెవెన్యూ ఉన్నతాధికారులు మంతనాలు జరుపుతున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది.
భూప్రక్షాళన నేపథ్యంలో..
భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వచ్చిన వివరాల ఆధారంగా రాష్ట్రంలోని రైతులం దరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత భద్రతా ప్రమాణాలతో కూడిన 75 లక్షలకుపైగా పుస్తకాల ముద్రణ కోసం గత నెలలో టెండ ర్లను ఆహ్వానించింది.
గత నెల 22 వరకు గడువు ఇచ్చింది. కానీ బిడ్లు రాకపోవడంతో 29వ తేదీ వరకు ఒకసారి, ఫిబ్రవరి 1 వరకు మరోసారి పొడిగించింది. అయినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. అటు గతంలో పాస్ పుస్తకాలను ముద్రించిన మద్రాస్ సెక్యూరిటీ ప్రింటింగ్ (ఎంఎస్‌పీ) ప్రెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను చూసి వెనక్కు తగ్గింది. దాదాపు 20 సెక్యూరిటీ ఫీచర్లతో 20 పేజీలతో కూడిన 75 లక్షల పాస్ పుస్తకాలను 21 రోజుల్లో ముద్రించి ఇవ్వాలన్న నిబంధన కారణంగా ప్రైవేటు కంపెనీలన్నీ వెనుకడుగు వేసినట్లు చెబుతున్నారు.
రంగంలోకి రాజీవ్‌శర్మ..
పాస్ పుస్తకాల ముద్రణకు ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ రంగంలోకి దిగారు. రెవెన్యూ ఉన్నతాధికారులతో భేటీ అయి, ప్రత్యామ్నా యాలపై చర్చించి సీఎంకు సమాచారమి చ్చారు. దీంతో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లోనే పాస్ పుస్తకాలను ముద్రించాలని సీఎం సూచించారు. ఈ మేరకు రెవెన్యూ ఉన్నతాధి కారులు మూడు, నాలుగు రోజులుగా ప్రింటింగ్ ప్రెస్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
కానీ ప్రభుత్వం కోరుతున్న సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ అధికారులు కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. ముఖ్యంగా పాస్ పుస్తకం దిగువ భాగంలో వినియోగించా ల్సిన పలుచని వస్త్రాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని, దీనితోపాటు మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్ల విషయంలోనూ ఇబ్బంది వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మింట్ కాంపౌండ్ ముద్రణాలయంలో పాస్ పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో రోజుకు రెండున్నర లక్షల వరకు పాస్ పుస్తకాలను ముద్రించే సౌలభ్యం ఉండడంతో.. కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను తగ్గించి ముద్రణ బాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా రైతులకు పాత తరహా పాస్ పుస్తకాలే కొత్తగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment