సైదాబాద్: ఓ ఆటో డైవర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు ఓ కానిస్టేబుల్‌ను చితకబాదారు. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రీన్‌పార్కు కాలనీలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్త్యా సిరినాయక్(40) చంపాపేట సమీపంలో సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌కు చెందిన వినోద్‌కుమార్ సిర్పూర్-టి పోలీస్ స్టేసన్‌లో కానిస్ట్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మద్యం మత్తులో ఉన్న వినోద్‌కుమార్ బోరబండ వెళ్లడానికి సిరినాయక్ ఆటో ఎక్కాడు.
ఆ తర్వాత వినోద్ కుమార్ నిద్రలోకి జారుకోవడంతో సిరినాయక్ సింగరేణి కాలనీలోకి తన నివాసానికి తీసుకెళ్లాడు. ఏమైందో గానీ, బుధవారం ఉదయం చూసే సరికి సిరినాయక్ ఆటోలోని డ్రైవింగ్ సీట్లోనే మృతి చెంది ఉన్నాడు. వెనుక సీట్లో వినోద్ నిద్రపోతున్నాడు. ఇది చూసిన స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో కానిస్టేబుల్‌ను చితకబాది...
Published Wed, Jun 8 2016 7:56 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement