హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేఛ్కిర్ రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక, ఆర్థి«క న్యాయం.. అందరికీ సమాన అవకాశాలు.. కుల వివక్ష నిర్మూలన కోసం రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ హస్తినాపురం షిర్డిసాయినగర్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే తాను స్థాపించబోయే పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్రంలో పాలకులు నిరుపేదలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. అవినీతి, అక్రమాలు, కల్తీ పెరిగిపోయి బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చకపోగా.. అవినీతిని పెంచిపోషించాయని చంద్రకుమార్ విమర్శించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, డాక్టర్ దేశగాని సాంబశివుడుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment