ప్రేమ, పెళ్లి పేరుతో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను లోబరుచుకొని తప్పించుకు తిరుగుతున్న ఓ యువకుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను లోబరుచుకొని తప్పించుకు తిరుగుతున్న ఓ యువకుడిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా అనుమల మండలం రాగుండ్ల తండాకు చెందిన రమేష్ (21) టీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రమేష్ గతంలో ఎల్‌బీనగర్‌లో ఓ ఇంటర్‌నెట్ సెంటర్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో అతడికి ఓంకార్‌నగర్‌లో నివాసముండే సుమ (27) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
సుమ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈమెకు ఆరు సంవత్సరాల పాప కూడా ఉంది. వివాహం చేసుకుంటానని చెప్పి సుమను రమేష్ లొంగదీసుకున్నాడు. ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. అయితే, ఆమెను పెళ్లి చేసుకోకుండా రమేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో సుమ వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.