
'డబ్బులిస్తారా లేక దూకమంటారా..'
హైదరాబాద్ : కూకట్‌పల్లి మెట్రో సమీపంలో ఉన్న ఇమామి టవర్స్ 17వ అంతస్తుపై నుంచి దూకుతానంటూ శ్రీనివాస్ అనే సివిల్ కాంట్రాక్టర్ ఆదివారం మధ్యాహ్నం హల్‌చల్ చేస్తున్నాడు. ఇమామి యాజమాన్యం తను చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోవడమే దీనికి కారణమని చెబుతున్నాడు.
సమాచారం అందుకుని ఈ దృశ్యాలను చిత్రీకరించటానికి వెళ్లిన మీడియాపై యాజమాన్యం దాడికి యత్నించింది. శ్రీనివాస్ చర్యతో కుటుంబసభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్న శ్రీనివాస్.. యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగి వచ్చాడు.