బాలానగర్ (హైదరాబాద్): నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన జబీర్ అనే వ్యక్తి బాలానగర్ ఐడీపీఎల్ టౌన్‌షిప్‌లో టూత్‌పేస్ట్‌లు అమ్ముకొని బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో జీడిమెట్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జబీర్‌ను ఢీకొంది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జబీర్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు.