‘మనూ’ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ముఖ్యంగా దూరవిద్యా ద్వారా ఎంఏ ఉర్దూ, చరిత్ర, ఇంగ్లిష్, బీఏ, బీఎస్సీ (బీజెడ్‌సీ, ఎంపీసీ), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
దరఖాస్తు పత్రాలు, ప్రాస్పెక్టస్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్ www.manuu.ac.in ద్వారా పొందవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు దేశంలోని న్యూఢిల్లీ, బెంగళూరు, పాట్నా, భోపాల్, దర్భంగా, శ్రీనగర్, రాంచి, కోల్‌కతాలోని రీజినల్ సెంటర్లలో కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 040- 23008402/04లలో సంప్రదించవచ్చు.