వేధించాడు.. రోడ్డెక్కాడు!
వివాహితను వేధించిన పోకిరి
సామాజిక సేవ శిక్ష వేసిన కోర్టు
గన్‌పార్క్ వద్ద నిర్వర్తించిన వైనం
సిటీబ్యూరో: వివాహితను వేధిం చిన దూరపు బంధువుకి న్యాయస్థానం సామాజిక సేవను శిక్షగా విధించింది. దీంతో అతగాడు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గన్‌పార్క్ సిగ్నల్ వద్ద నిల్చుని ‘షీ–టీమ్’ పోస్టర్ ప్రదర్శించినట్లు అదనపు సీపీ స్వాతి లక్రా వెల్లడించారు. మౌలాలీ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఎంఏ రహీమ్ తన దూరపు బంధువును ఫోన్ ద్వారా వేధించడం మొదలెట్టాడు. ఆమె ఇంటి సమీపంలోనే సంచరిస్తూ... భర్త లేని సమయం గుర్తించి ఫోన్లు చేసేవాడు. ఎవరు ఈ పని చేస్తున్నారో తెలి యక ఆమె పలుమార్లు తన సెల్ నెంబర్ మార్చుకున్నారు. అయినప్పటికీ బంధు వు కావడంతో తేలిగ్గా కొత్త నెంబర్ సేకరించి కాల్ చేసి వేధించేవాడు. ఈ బాధ తాళలేక ఆ వివాహిత చివరకు తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో ఆమె భర్త నెంబర్‌కు రహీం కాల్ చేసి ఫోన్‌ను భార్యకు ఇవ్వాల్సిందిగా చెప్పి మరీ ఆమెను వేధించేవాడు.
ఈ చర్యలతో భార్యాభర్తల మధ్య స్వల్ప స్పర్థలు కూడా రేగాయి. మ్యారేజ్ కౌన్సిలర్ సలహా మేరకు ఆమె షీ–టీమ్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడైన రహీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుకు వి వాహిత అంగీకరించకపోవడంతో పెట్టీ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యా యమూర్తి నిందితుడికి జరిమానాతో పాటు ఒక రోజు సామాజిక సేవ చేయాల్సిందిగా శిక్ష విధించారు. దీంతో సోమవారం గన్‌పార్క్ సిగ్నల్ వద్ద ‘విధులు నిర్వర్తించిన’ రహీమ్ షీ–టీమ్స్ పోస్టర్లు ప్రదర్శించారు.