
మంత్రి ఈటెలకు జన్మదిన శుభాకాంక్షలు
అబిడ్స్: తెలంగాణ రాష్ర్ట ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోషామహాల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్వీ ఇన్‌చార్జి ముఖేష్ ముదిరాజ్, టీఆర్‌ఎస్ నాయకులు సురేష్‌ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయనకు పూలబొకే అందజేసి ఘనంగా సత్కరించారు.
అనంతరం మంత్రి తో కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో నాయకులు అభిలాష్ ముదిరాజ్, అశోక్, శిరీష్, కె.సాయికుమార్ పాల్గొన్నారు.