భార్య పుట్టిన రోజు వేడుకలు... దొరికిపోయిన ఎమ్మెల్యే | MLA Jagga reddy distribution cell phones , pressure cookers due to elections | Sakshi
Sakshi News home page

భార్య పుట్టిన రోజు వేడుకలు... దొరికిపోయిన ఎమ్మెల్యే

Published Sat, Apr 12 2014 8:06 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

భార్య పుట్టిన రోజు వేడుకలు... దొరికిపోయిన ఎమ్మెల్యే - Sakshi

భార్య పుట్టిన రోజు వేడుకలు... దొరికిపోయిన ఎమ్మెల్యే

ఓ వైపు ఎన్నికలు... ఓటర్లకు తాయిలాలు పంచుదామంటే ఎన్నికల సంఘం ఆంక్షలు ఏం చేయాలి... ఆలోచనలతో మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి  బుర్ర వెడేక్కిపోయింది. అంతలో ఎమ్మెల్యేగారికి బుర్రలో మెరుపులాంటి ఆలోచన ఉరుమై మెరిసింది. అంతే భార్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేయాలని సంకల్పించాడు. అంతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఓ ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకోవాలని అనుచర గణాన్ని ఆదేశించాడు. అంతేకాదు వచ్చిన ఆహ్వానితుల కోసం అదేనండి ఓటర్ల కోసం సెల్ఫోన్లు, కుక్కర్లు వగైర పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాడు.

భార్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ప్రారంభించాడు. పిలిచిన ఆహ్వానితులంతా పొల్లుపొకుండా వేడుకకు హాజరైయ్యారు. అంతా కనులపండుగగా జరుగుతుంది. ఇంకేమంది ఓటర్లకు సెల్ఫోన్లు, కుక్కర్లు పంపిణీ చేసేయమని అనుచరగణాన్ని ఆదేశించాడు. అంతలో ఎన్నిక సంఘానికి చెందిన అధికారులు, పోలీసులు సంయుక్తంగా అక్కడికి చేరుకుని సైంధవుల్లా అడ్డుపడ్డారు. భారీ ఎత్తున సెల్ఫోన్లు, కుక్కర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లుగా అయిందని జగ్గారెడ్డిగారు బిక్కుబిక్కుమంటూ అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement