అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. నెగటివ్ మార్కులు!
అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది.
ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది.
ప్రవేశ పరీక్షల్లో నెగటివ్ మార్కులు!
Published Tue, Oct 18 2016 3:02 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement