Professional Education Course
-
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం, వారికి ఊరట
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఊరటనిచ్చారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటా కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును స్వాగతించడం విశేషం. చదవండి: వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 13 మంది మృతి ప్రభుత్వం యూనివర్సిటీల్లో వెటర్నరీ సైన్సెస్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని కేటగిరీలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్థిక అసమానతల కారణంగా వారు కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందలేకపోయారని వ్యాఖ్యానించారు. గ్రామాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? కాగా ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రభుత్వ-ఎయిడెడ్ కళాశాలల్లో రిజర్వేషన్లపై జస్టిస్ (రిటైర్డ్)డీ మురుగేశన్ కమిటీ సిఫారసుల మేరకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం గతంలో నిర్ణయించింది. -
జనవరి తొలి వారంలో సెట్స్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) షెడ్యూల్‌ను జనవరి మొదటి వారంలో ప్రకటించేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా షెడ్యూల్‌ను ఖరారు చేయాలని భావించినా ఈ నెల 22న నిర్వహించాల్సిన వైస్ చాన్స్లర్ల సమావేశం వాయిదా పడటంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌పై చర్చించలేదు. జనవరి మొదటి వారంలో వాటిపై చర్చించి పరీక్షల నిర్వహణ తేదీలను ఖరారు చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ నెలాఖరు నుంచే ప్రారంభించేలా షెడ్యూల్ తయారీ కోసం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా తేదీలతోపాటు పండుగ రోజలనుమినహాయించి ఇతర తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయా సెట్స్‌కు కన్వీనర్లను నియమించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, పీజీ ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, న్యాయ విద్యా కోర్సుల్లో చేరాలనుకునే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రవేశపరీక్షల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. 28 లేదా 29న ఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు ఫీజల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్ ఈ నెల 28 లేదా 29న జారీ అయ్యే అవకాశం ఉంది. గత వారమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఏఎఫ్ఆర్సీ భావించినా ఆన్లైన్ ప్రాసెస్ చేసే సంస్థ ఖరారులో జాప్యం కావడంతో నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. కాలేజీ యాజమాన్యాల నుంచి మూడేళ్ల ఆదాయ వ్యయాలు, కొత్త ఫీజుల ప్రతిపాదనలను ఆన్లైన్లో స్వీకరించే పనులను గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేయగా ప్రస్తుతం నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్ఐసీ అధికారులతో చర్చించి ప్రతిపాదనలతో కూడిన దరఖాస్తులను స్వీకరించేందుకు తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈ నెల 28 లేదా 29న ఖరారు అయ్యే అవకాశం ఉందని పాపిరెడ్డి తెలిపారు. -
ఆ కోర్సులు మాకొద్దు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు ఆదరణ తగ్గుతోంది. విద్యా బోధనలో నాణ్యత కొరవడటం.. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్ (ఎంసీఏ), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్) తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లకు గతేడాది 4,56,990 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 4,00,953 మందే దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు తేల్చింది. అంటే గతేడాదితో పొలిస్తే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 56 వేలు తగ్గింది. ఎడ్‌సెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు ఎడ్‌సెట్ దరఖాస్తులు గతేడాది కంటే 40 శాతం తగ్గాయి. 2017లో 64,029 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 38,414 మందే పరీక్షకు హాజరవనున్నారు. ఐసెట్ రాసేందుకు గతేడాది 77,422 మంది.. ఈ సారి 62,631 మంది ఆసక్తి చూపారు. ఎంటెక్, న్యాయ విద్య, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకూ ఆదరణ తగ్గుతోంది. అలాగే ఎంటెక్ కోసం ప్రవేశ పరీక్ష రాసే వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 12,668 తగ్గింది. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ రాసే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 79,033 మంది.. ఈ సారి 73,106 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీటెక్‌పై డిప్లొమా విద్యార్థుల్లో ఆసక్తి పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది కంటే ఈ సారి 2,788 మంది ఎక్కువగా ఈసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్ ద్వారా బీటెక్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న వారి కూడా సంఖ్య పెరిగింది. గతేడాది 1,41,137 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి 1,47,958 మంది పరీక్ష రాయనున్నారు. మార్పులతోనే తగ్గుదల గతంలో డిగ్రీల కోసం ఏదో ఓ కాలేజీలో చేరడం.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతోనే ఆదరణ తగ్గుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా నిబంధనలు కఠినం చేయడంతో చదువుకోవాలన్న శ్రద్ధ ఉన్న విద్యార్థులే కాలేజీల్లో చేరుతున్నారని చెబుతున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణలూ సంఖ్య తగ్గడానిక మరో కారణమని పేర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గినందునే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో విద్యా ర్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల ఆలోచన ల్లోనూ మార్పొచ్చింది. అనవసరంగా ఫీజులు చెల్లించి చదువలేకపోతే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. పైగా నాణ్యత లేకుండా చదివినా ప్రయోజనం ఉండదని, ఉపాధి లభించదని అవగాహనకొచ్చారు. అందుకే సీరియస్‌గా చదువుకోవాలనుకునే వారే వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో చేరుతు న్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ వారు అర్హులు కాదని, ఎస్జీటీ వారే అర్హులని ఎన్సీటీఈ ఉత్తర్వులు ఇవ్వడం.. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ -
ప్రవేశ పరీక్షల్లో నెగటివ్ మార్కులు!
అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. నెగటివ్ మార్కులు! అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది.