state division act
-
విభజన చట్టం అమలుకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్ అంశాలను పరిష్కరిస్తూ వాటి అమలుకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్కో తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన బకాయిలు తెలంగాణ సర్కారు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి అనురాధా ప్రసాద్ అధ్యక్షతన శనివారం తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, జల వనరుల సలహాదారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఏపీ చేసిన వినతికి స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. కేంద్రం ఆదేశాలతోనే పెండింగ్ అంశాలు పరిష్కారం అవుతాయని, లేదంటే ఎన్నేళ్లయినా అపరిష్కృతంగానే ఉంటాయని ఏపీ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించి ఏపీకి రూ.6,015 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉందని ఇటీవలే కేంద్ర న్యాయ శాఖ కూడా తెలిపింది. ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో గతంలో కేసు వేసింది. హైకోర్టులో కేసు ఉన్నందున కేంద్రం ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. సమస్య పరిష్కారమయ్యేలా ఉన్నందున కేసు ఉపసంహరించుకుంటున్నామని, పరిష్కారం కాకపోతే మళ్లీ వస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరింది. కోర్టు కేసు కూడా లేనందున కేంద్రం వెంటనే విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను నిలువరించాలని ఏపీ కోరింది. ఈ ప్రాజెక్టుల కారణంగా దిగువనున్న ఏపీకి కలిగే నష్టాన్ని వివరించింది. అలాగే విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, విభజన జరిగిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రస్తావించింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. -
చేసింది గోరంత.. చెప్పుకున్నది కొండంత
-
పునాదుల్లోనే పోలవరం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధప్రాతిపదికన పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అది. చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇప్పటికే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది. 960 మెగావాట్ల జలవిద్యుత్ అందుబాటులోకి వచ్చేది. విశాఖపట్నంలో తాగు, పారిశ్రామిక నీటి అవసరాలు తీరడంతోపాటు 540 గ్రామాల ప్రజల దాహార్తి తీరేది. అలాంటి బహుళార్ధక సాధక పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నాలుగేళ్ల పది నెలల చంద్రబాబు నాయుడి పాలన శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను 2018 మే నాటికే పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లిస్తామని 2016 సెప్టెంబరు 30న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. నాలుగేళ్ల పది నెలల్లో 90 సార్లు వర్చువల్ రివ్యూలు.. 29 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించానని గొప్పలు చెప్పారు. కానీ, పోలవరం ప్రాజెక్టులో ప్రధాన జలాశయం(ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్) పనులు పునాది స్థాయిని కూడా దాటకపోవడం గమనార్హం. పోలవరం పనులు ఎంత వేగంగా జరిగాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. సగం కూడా పూర్తి కాని కాఫర్ డ్యామ్ పోలవరం కాఫర్ డ్యామ్ విషయంలో నేల విడిచి సాము చేస్తూ చంద్రబాబు ప్రదర్శించిన విన్యాసాలు ప్రాజెక్టుకు శాపంగా మారాయి. ఒకే సీజన్లో పూర్తి చేయాల్సిన కాఫర్ డ్యామ్ పనులను సగ భాగం కూడా పూర్తి చేయలేకపోయారు. గతేడాది రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉన్నా గోదావరికి గరిష్టంగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. ఈ ఏడాది అదే రీతిలో ప్రవాహం వచ్చినా, ఆ ఉధృతికి కాఫర్ డ్యామ్ తట్టుకుని నిలబడగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ చేసిన కాఫర్ డ్యామ్ పనులను రక్షించడం.. ముంపు గ్రామాల్లోకి వరద ముంచెత్తకుండా చూడటం సవాల్‌గా మారింది. చేసింది గోరంత.. చెప్పుకున్నది కొండంత - పోలవరం హెడ్ వర్క్స్‌లో మట్టి పనులు 1,169.56 లక్షల క్యూబిక్ మీటర్లు చేయాలి. ఇప్పటివరకూ 1,012.65 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. ఇంకా 156.91 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మిగిలాయి. - పోలవరం హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల్లో 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాలి. ఇప్పటివరకూ 30.28 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశారు. ఇంకా 8.60 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. - గేట్ల తయారీకి 18 వేల టన్నుల స్టీల్ అవసరం. ఇప్పటివరకూ 12,583 టన్నుల స్టీల్‌తో స్కిన్ ప్లేట్లు రూపొందించారు. గేట్లను బిగించడానికి అవసరమైన హైడ్రాలిక్ హాయిస్ట్‌లు ఇప్పటికీ సేకరించలేదు. - ఎగువ కాఫర్ డ్యామ్ పనుల్లో 72.56 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ 43.97 లక్షల క్యూ.మీ., దిగువ కాఫర్ డ్యామ్ పనుల్లో 26.84 లక్షల క్యూబిక్ మీటర్లకుగానూ 9.21 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేశారు. - జలాశయంలో ముంపునకు గురయ్యే 222 గ్రామాలకు చెందిన 1,05,601 నిర్వాసిత కుటుంబాలకుగానూ కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. ఇంకా 1,01,679 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. - కుడి కాలువలో ఇప్పటికీ 18 కిలోమీటర్ల లైనింగ్ పనులు మిగిలిపోయాయి. - ఎడమ కాలువలో ఇప్పటికీ 25 కిలోమీటర్ల తవ్వకం, 90 కిలోమీటర్ల పొడువున లైనింగ్ పనులు మిగిలిపోయాయి. - పోలవరం ప్రాజెక్టు, నిర్వాసితుల పునరావాసానికి 1,31,102.67 ఎకరాల భూమి సేకరించాలి. ఇప్పటిదాకా 98,316.72 ఎకరాలు సేకరించారు. ఇంకా 32,785.95 ఎకరాలు సేకరించాల్సి ఉంది. - వీటిని పరిగణనలోకి తీసుకుంటే పావలా భాగం పనులు కూడా పూర్తి కాలేదని స్పష్టమవుతోంది. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం 66.74% పూర్తి చేసినట్లు గొప్పగా ప్రకటించుకోవడం గమనార్హం. -
మీకు రోషం లేదా?
సాక్షి, అమరావతి: ఏపీకి అన్యాయం జరుగుతూంటే మీకు రోషం లేదా.. సిగ్గులేదా? అంటూ సీఎం చంద్రబాబు బీజేపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విభజన చట్టం అమలు’ అంశంపై శాసనసభలో శుక్రవారం బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతున్న సమయంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. వచ్చీ రావడంతోనే విరుచుపడ్డారు. ‘ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో ఎన్ని కేంద్ర ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయో తెలుసా? ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు? రక్తం పొంగుతోంది, మీరు రాష్ట్రంలో ఊడిగం చేస్తారా? ఏం మమ్మల్ని జైల్లో పెడతారా’ అంటూ ఊగిపోయారు. సీఎం వ్యాఖ్యల పట్ల బీజేపీ సభ్యులు విష్ణుకుమార్‌రాజు, మాణిక్యాలరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే సీఎం తన వ్యాఖ్యలు కొనసాగించారు. ‘మీరు ప్రజా ప్రతినిధులుగా ఉండటానికి అర్హత లేదు, ఏం తమాషా చేస్తారా? మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? ’ అంటూ వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికలకు ముందు మాణిక్యాలరావు ఎవరో తెలియదని, తమ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించినా తానే అందరికీ నచ్చజెప్పి గెలిపించామన్నారు. ‘హైదరాబాద్‌ను నేనే కట్టాను, ఐఎస్బీని కష్టపడి తెచ్చాను. రాష్ట్రంలో 14 సీట్లు ఇస్తే 4 గెలిచారు. ఈ రాష్ట్రంలో మీకు బలముందా? కియా మోటార్స్‌ను నేను తెస్తే బీజేపీ తెచ్చిందని అంటారా? ఆనాడు గోద్రా అల్లర్ల సమయంలో మోదీని తీవ్రంగా వ్యతిరేకించాను. వాజ్‌పేయిని చూసి బయటకు రాలేకపోయాను’ అంటూ ఊగిపోయారు. పోలవరం ప్రాజెక్టు 65 శాతం పనులు పూర్తయ్యాయని, దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు అయినా ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది? ‘కడపలో స్టీల్ ప్లాంటు గురించి అడిగితే బీజేపీ వారు రాయలసీమ డిక్లరేషన్ ఇస్తారు. విపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కడప ఉక్కు కర్మాగారం గురించి అడగరు. అప్పటి యూపీఏ సర్కారు రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పెట్టింది. మరి బీజేపీ సర్కారు ఎన్ని పెట్టింది? చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు మొండిచేయి చూపారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు ఫైలును పైకి, కిందకు తిప్పుతున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపును కూడా అడ్డుకున్నారు. చివరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏపీ గురించి ఒక్క పదం కూడా లేదు. బీజేపీ మోసానికి నిరనసగా ఈనెల 11న ఢిల్లీలో నినదించడానికి నిరాహార దీక్ష పెడుతున్నాం. దీక్ష తర్వాత రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తాం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ ఎక్కడుందో తెలియదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాది యూటర్న్ కాదు రైట్ టర్న్. కోడికత్తి (జగన్‌పై హత్యాయత్నం) కేసుతో మీకు (కేంద్ర ప్రభుత్వానికి) ఏమి సంబంధం? మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ఐఏ చట్టాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడేమో ఆయన కోడికత్తికి ఈకలు పెరికారు. ‘సిట్’ ఏమి చెప్పిందో ఎన్ఐఏ అదే చెప్పింది. బీజేపీ సర్కారు రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా ముంచుతోంది’ అని అన్నారు. వెంకయ్యకు పదోన్నతో.. పనిష్మెంటో తెలియట్లేదు రాష్ట్రం విషయంలో బీజేపీ కంటే బ్రిటీష్ వారే మెరుగ్గా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. ‘గుజరాత్‌కు బుల్లెట్ రైలుకు రూ.1.15 లక్షల కోట్లు ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటుకు రూ.2500 కోట్లు ఇచ్చారు. రాజధాని అమరావతికి మాత్రం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏం మనం పన్నులు కట్టడంలేదా? ఏపీ భారత్‌లో లేదా? మనకు రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. దక్షిణ భారతదేశానికి మీరు (బీజేపీ వారు) ఏం చేశారు? అన్నీ గుజరాత్‌కు చేస్తున్నారు. వెంకయ్యనాయుడిని మంత్రి పదవి నుంచి తప్పించి కోపంతో ఉప రాష్ట్రపతిని చేశారు. ఇది పనిష్మెంటో? పదోన్నతో దేవుడికే తెలియాలి. ఏమి చేశారని మోదీ విశాఖపట్నం వస్తారు? రైల్వే జోన్ ఇచ్చి విశాఖపట్నం రండి’ అని చంద్రబాబు అన్నారు. -
ప్రవేశ పరీక్షల్లో నెగటివ్ మార్కులు!
అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. నెగటివ్ మార్కులు! అమలుకు యోచిస్తున్న విద్యా శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో జేఈఈ, నీట్ తరహా నెగటివ్ మార్కుల విధానం అమలు చేసే అంశంపై విద్యాశాఖ యోచిస్తోంది. రాష్ట్రంలో ఆ విధానం అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆమోదం కూడా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో చర్చించాకే తుది నిర ్ణయం తీసుకోవాలని విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రవేశాల్లో కనీస వయోపరిమితి తగ్గిద్దామా?: ఇంటర్మీడియెట్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల కనీస వయోపరిమితిని సంవత్సరం లేదా రెండేళ్లు తగ్గించే అంశంపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ప్రస్తుతం 16, 17 ఏళ్లకే కొంత మంది ఇంటర్ పూర్తి చేసుకొని వయోపరిమితి సడలింపు కోసం ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నందున.. దీని సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. -
తెలంగాణపై చంద్రబాబు మరో కుట్ర
శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయంటూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోకుట్ర పన్నుతున్నాడని, ఆయనకు కేంద్రమంత్రి వెంకయ్య వత్తాసు పలుకుతున్నాడని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలు గడిచాక ఇపుడు విభజన చట్టంలో లోపాలు వెదికి కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని బూర్గంపాడు మండలంపై చంద్రబాబు కన్ను పడిందని, కిన్నెరసాని ప్రాజెక్టును కాజేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మేల్కోవాలని, విహంగ వీక్షణం వదిలి భూప్రదక్షిణం చేపట్టాలన్నారు. -
విభజన చట్టంలో సవరణలు: వెంకయ్యనాయుడు
-
విభజన చట్టంలో సవరణలు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని లొసుగులు, అనాలోచిత నిర్ణయాలతో చట్టం తెచ్చిందని విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్షం సరిగా వ్యవహరించడంలేదన్నారు. శారదా స్కాంలో సీబీఐ తన పని తాను చేస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ కేంద్రంతో కలిసి పనిచేయాలనుకోవడం మంచి పరిణామం అన్నారు.టీడీపీ, టీఆర్ఎస్తో విభేదాలు ఉన్నా, రెండు కొత్త రాష్ట్రాలకు కేంద్రం సాయం అందుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు. **