
వెంకయ్య నాయుడు
హైదరాబాద్: పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు ఆయన చెప్పారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని లొసుగులు, అనాలోచిత నిర్ణయాలతో చట్టం తెచ్చిందని విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్షం సరిగా వ్యవహరించడంలేదన్నారు.
శారదా స్కాంలో సీబీఐ తన పని తాను చేస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ కేంద్రంతో కలిసి పనిచేయాలనుకోవడం మంచి పరిణామం అన్నారు.టీడీపీ, టీఆర్ఎస్తో విభేదాలు ఉన్నా, రెండు కొత్త రాష్ట్రాలకు కేంద్రం సాయం అందుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.
**