భారీ వర్షాలు.. రంగారెడ్డిలో స్కూళ్లకు సెలవు | officials declared holiday for schools due to heavy rain | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు.. రంగారెడ్డిలో స్కూళ్లకు సెలవు

Published Wed, Sep 21 2016 10:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

భారీ వర్షాలు.. రంగారెడ్డిలో స్కూళ్లకు సెలవు - Sakshi

భారీ వర్షాలు.. రంగారెడ్డిలో స్కూళ్లకు సెలవు

మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బాలానగర్, కుత్బుల్లా పూర్, మల్కాజ్ గిరి, శేరిలింగంపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు ఆదేశాలు జారీ చేశారు. పల్లపు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయం కావడం, బుధవారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement