బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | one person died after car collied to road devider in banjarahills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Tue, Jul 11 2017 3:24 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

బంజారాహిల్స్‌:  హైదరాబాద్‌లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 3లోని జంక్షన్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టి పూర్తిగా తిరగలపడి ధ్వంసమైంది. ఈ ఘటనలోఒక ఫర్సత్‌ అలీ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు ఫర్సత్‌ ముఫకంజా కాలేజీలో చదువుతూ ఎమ్మెల్యేకాలనీలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. గాయపడిన వ్యక్తిని పోలీసులు అతి కష్టంమీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

నిత్యం రద్దీ ఉండే రహదారి కావడంతో ఈ ప్రమాదం కారణంగా భారీ స్థాయిలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కారులో చనిపోయిన వ్యక్తి బాగా ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చింది. ధ్వంసమైన కారును క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన జంక్షన్‌కు ముందే ఒక మలుపు ఉండటంతోపాటు స్లోప్‌ మరీ ఎక్కువుంటుంది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన కారు అమాంతం వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement