బీమారీ.. హైదరాబాదీ | patients in hospitals | Sakshi
Sakshi News home page

బీమారీ.. హైదరాబాదీ

Published Tue, Jul 8 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

బీమారీ..  హైదరాబాదీ

బీమారీ.. హైదరాబాదీ

భాగ్యనగరం.. ఇప్పుడొక కాలుష్య కాసారం.. తినే తిండి దగ్గరి నుంచి, తాగే నీరు, పీల్చే గాలి.. ఇలా అన్నీ కలుషితమే. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన నగరవాసులు.. జబ్బుల బారిన పడుతున్నారు. చిన్న,    పెద్ద, ఆడ, మగ, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో కనీసం బెడ్ దొరకని దుస్థితి. వివిధ రకాల జబ్బులపై ప్రత్యేక కథన ం!
 - నోముల శ్రీశైలం/ సాక్షి, సిటీబ్యూరో
 
కొవ్వు కేక..

స్థూలకాయం... వందలో ఏ ఒక్కరిలోనో కన్పించేది. అది కూడా జన్యు సంబంధంతో కూడినదై ఉండేది. 2005లో స్థూలకాయుల సం ఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం ప్రతి ఆరుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. చిన్నారుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు నోవా ఆస్పత్రికి చెందిన ప్రముఖ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మహిధర్ వల్లెటి చెప్పారు. అంటే గ్రేటర్‌లో సుమారు కోటి జనాభా ఉంటే, అందులో ఐదు లక్షల మంది అధిక బరు వుతో బాధపడుతున్నారన్నమాట. తగ్గిన శారీరక శ్రమ.. నిశీరేయిలో విందులు, వినోదాలు.. పిజ్జా లు, బర్గర్లు... వెరసి శరీరంలో కొవ్వును పేర్చేస్తున్నాయి. పీలగా ఉన్న వారిని సైతం పీపాలా తయా రు చేస్తున్నాయి. ఇది ఒక జబ్బు కాకపోవచ్చు కానీ, అనేక ఇతర జబ్బులకు కారణం అవుతోంది.
 
సంతాన లేమితో సతమతం

ఉరుకుల పరుగుల జీవితం.. రోజంతా కంప్యూటర్లతో సహవాసం.. ఆలస్యపు పెళ్లిళ్లు.. ఉపాధి.. ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి.. వెరసి దంపతుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భార్య ఒక షిఫ్టులో పని చేస్తే.. భర్త మరో షిఫ్టులో పని చేయాల్సి వస్తోంది. ఫలితంగా స్త్రీ, పురుషుల హార్మోన్లలో సమతుల్యత లోపించి, సంతానలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీహబ్‌గా పేరుగాంచిన హైటెక్‌నగరంలో ప్రస్తుతం నూటికి 30 శాతం మంది ఐటీ దంపతులు పిల్లల కోసం పరితపిస్తున్నారు. వీరిలో 20 శాతం దంపతులు సంతాన సాఫల్య కేంద్రాల (ఇన్ ఫెర్టిలిటీ సెంటర్లు)ను ఆశ్రయిస్తుండగా, ఏడు శాతం మంది టెస్ట్‌ట్యూబ్ బేబీని, మూడు శాతం ‘సరోగేట్ మదర్స్’వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.

కిడ్నీ జబ్బుల్లో గ్రేటరే టాప్

కిడ్నీ జబ్బుల్లోనూ గ్రేటర్ అగ్రస్థానంలోనే ఉంది. దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-12 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఇటీవల ఎయిమ్స్, నిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో కిడ్నీ జబ్బుల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉన్నట్లు తేలింది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 15,000 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 200 ైపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాం టేషన్లు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్రచికిత్సలు చేస్తుండగా, నిత్యం ఇక్కడ 300 మంది చికిత్స పొందుతున్నట్లు కిడ్నీ మార్పిడి శ స్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ శ్రీ భూషణ్‌రాజు స్పష్టం చేశారు.


శ్వాసా కష్టమే

నగరంలో ఐదు శాతం మంది పెద్దలు, 20 శాతం మంది చిన్నారులు శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్నారు. వాతావరణంలో ఓజోన్ 100 మైక్రోగ్రాములు దాటకూడదు. కానీ, పగటివేళ 120-150 మైక్రోగ్రాము లు దాటుతోంది. సీసం, ఆర్సెనిక్, నికెల్ వంటి భారలోహ మూలకాలు కలిగిన గాలి పీల్చడం ద్వారా నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. కాలుష్యం వల్ల ముక్కు ద్వారాలు మూసుకుపోయి గాలి తీసుకోవడం కష్టమవుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది.

బ్రెస్ట్ కేన్సర్‌తో బేజార్

ఐఏఆర్‌సీ సర్వే ప్రకారం దేశంలో ఏటా కొత్తగా పది లక్షల కేన్సర్ కేసుల నమోదు అవుతుండగా, ఒక్క హైదరాబాద్‌లోనే పదివేల కేసులు నమోదు అవు తున్నట్లు సమాచారం. గ్రామీణ మహిళలతో పోలిస్తే పట్టణ మహిళల్లో గర్భాశయ ముఖద్వార కేన్సర్ తక్కువగా ఉన్నా... రొమ్ము కేన్సర్ మాత్రం రెట్టింపవు తోంది. ప్రతి వంద కేన్సర్ బాధితుల్లో 60 శాతం రొ మ్ము, 40 శాతం గర్భాశయ ముఖద్వార కేన్సర్ బాధితులే. ఇక పొగాకు ఉత్పత్తుల వల్ల ఏటా 2 లక్షల కేన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా 40కి పైగా కేన్సర్ ఆస్పత్రులు హైదరా బాద్‌లోనే ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

రోడ్డెక్కితే గుల్లే

బైక్ నడిపేవారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారును నడిపేవారు నడుము, పిరుదులు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వీరు సరైన భంగిమలో కూర్చోక పోవడం వల్ల గుంతల్లో ఎత్తేసిన ప్రతిసారీ డిస్క్‌ల మధ్య కదలికలు ఎక్కువై జాయింట్స్ అరిగి పోతున్నాయని యశోద ఆస్పత్రికి చెందిన స్పైన్ సర్జన్ డాక్టర్ కె.సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ఓపీకి వ స్తున్న బాధితుల్లో 60 శాతం మంది వెన్ను, ఇతర ఒంటి నొప్పులతో బాధపడుతున్న వారేనని సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సుబ్బయ్య చెప్పారు.
 
 పంజా విసురుతున్న  15  రకాల స్వైన్ ఫ్లూ కారకవైరస్‌లు
 
 60 %  మోకాళ్లు,  ఒంటి నొప్పులతో బాధపడుతున్నవారు
 
6 లక్షలు హృద్రోగులు
 
25 లక్షలు నగరంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య
 
2,132  గత నాలుగేళ్లలో డెంగీ, మలేరియా బారిన పడినవారు
 
1,993  గత నాలుగేళ్లలో స్వైన్ ఫ్లూ బారిన పడిన వారి సంఖ్య
 
5,00,000  స్థూలకాయంతో  బాధ పడుతున్నవారు    
 
1012 లక్షలు కిడ్నీ సంబంధిత రోగుల సంఖ్య
 
15 రకాల స్వైన్ ఫ్లూ కారక వైరస్‌లు

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్1ఎన్1ఇన్‌ఫ్లూయెంజా(స్వైన్‌ఫ్లూ)వైరస్ నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మాసాల్లో విస్తరించే ఈ వైరస్ ఏడాది పొడవునా తన ఉణికిని చాటుకుంటూనే ఉంది. ప్రతికూల పరిస్థితుల వల్ల గ్రేటర్ వాతావరణంలో 15 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌లు ఉన్నట్లు ఎర్రగడ్డ ఛాతీ వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్వైన్‌ఫ్లూ వైరస్ కూడా ప్రస్తుతం సాధారణ వైరస్‌లా మారిపోయింది. 2009లో 840 మంది దీని బారిన పడగా, 2010లో 784 మంది, 2011లో 9 మంది, 2012లో 314 మంది, 2013లో 17 మంది, 2014లో 29 మంది స్వైన్ ప్లూ బారిన పడ్డారు.

డెంగీ, మలేరియా సరే సరి..

పారిశుద్ధ్య నిర్వహణ లోపం, రోడ్లపై పారు తున్న మురుగు నీటితో గ్రేటర్ కంపు కొడుతోంది. పందుల స్థానంలో నేడు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ ఆస్పత్రిలోకి తొంగి చూసినా డెంగీ, మలేరియా బాధితులే దర్శనమిస్తారు. 2009లో 329 మలేరియా కేసులు నమోదు అయితే 2012లో 528 కేసుల నమోదు అయ్యా యి. అదే విధంగా 2009లో 525 డెంగీ కేసులు వెలుగు చూస్తే 2012లో 750కి పైగా కేసులు వెలుగు చూశాయి. 17 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

గుండె గుభేల్...

నగరం కేవలం రాష్ట్రానికి రాజధాని మాత్రమే కాదు, తాజాగా గుండె నొప్పికి కేంద్ర బిందువుగా మారుతోంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం గుండె జబ్బులు చాలా అరుదు. వేయి మందిలో ఎవరో ఒకరికి మాత్రమే అన్నట్లుగా ఉండేది. కానీ నేడు ఏ కార్పొరేట్ ఆస్పత్రి గడపతొక్కినా.. నిత్యం 70-100 మంది హృద్రోగులే తారసపడతారు. వీరిలో 50 ఏళ్ల లోపు వారే ఎక్కువ. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ప్రపంచంలో ప్రతి వంద మందిలో ముగ్గురు గుండె నొప్పితో బాధపడుతుండగా, గ్రేటర్‌లో ఐదు నుంచి ఆరుగురు ఉండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.‘తాను పని చేస్తున్న సన్‌షైన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రతినెలా 500 మందికి డయాగ్నైస్ చేస్తే, అందులో 150-200 మందికి యాంజియోప్లాస్టీ చే స్తున్నాం. 130-150 మందికి మినిమల్లీ ఇన్వేసివ్, బైపాస్ సర్జరీలు చేస్తున్నాం. ఇలా ఏడాదికి ఏడు వేల మందికి చికిత్స చేస్తున్నాం. అంతేకాదు ప్రపంచంలో మరెక్కడా లేనన్ని క్యాథ్‌ల్యాబ్స్, ఎంఆర్‌ఐ మిషన్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని డాక్టర్ శరత్‌కుమార్ తెలిపారు.

తియ్య తియ్యగా

చక్కెర వ్యాధి.. పాతికేళ్ల క్రితం చాలా అరుదు. ప్రస్తుతం నగరంలో ప్రతి పదిమందిలో ఇద్దరి నుంచి ముగ్గురు మధుమేహంతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఇది రెట్టింపయ్యే అవకాశముంది. గ్రేటర్‌లో  22-25 శాతం మంది చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. అంటే గ్రేటర్ జనాభా సుమారు కోటి ఉంటే, 25 లక్షల మంది మధుమేహులే అన్నమాట. బాధితుల్లో 40 ఏళ్లు దాటినవారు 85-95 శాతం మంది, 18 ఏళ్ల లోపు వారిలో 10-15 శాతం మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని నిమ్స్ డయా బెటిక్ సెంటర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement