యాకుత్‌పురా(హైదరాబాద్): పోలీసులు చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వేలో గురువారం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు.
వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన కైరున్నీసా (45)కు ఫౌజియా (19), మరో బాలిక (13)లు కూతుళ్లున్నారు. కైరున్నీసా గత కొన్ని నెలలుగా కూతుళ్లతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పిక్ ప్యాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సుల్తాన్‌బజార్‌లో రెండు, అఫ్జల్‌గంజ్‌లో రెండు, చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. నేరస్తుల సర్వేలో అదుపులోకి తీసుకున్న వీరిని విచారించి వదిలేశారు.
మహిళా చైన్ స్నాచర్లకు కౌన్సెలింగ్
Published Thu, Nov 5 2015 9:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement