Chian snacters
-
బస్‌లో ప్రయాణించే మహిళలే వీరి టార్గెట్
సాక్షి, మిర్యాలగూడ : బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల దృష్టిని మరల్చి బంగారం, నగదును అపహరించే ముగ్గురు మహిళా దొంగల ముఠా సభ్యులను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సస్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సదానాగరాజు కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన దనుగుల కవిత, కోదాడ పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంపంగి సైదమ్మ, సంపంగి తిరుపతమ్మలు ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్‌లో బస్సు ఎక్కే మహిళల హాండ్‌బ్యాగ్‌లు, పర్సులు, దొంగలిస్తారని తెలిపారు. ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ బస్టాండ్‌లో రద్దీగా ఉండే బస్సులను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలి పారు. ఇదే క్రమంలో 2017లో మిర్యాలగూడ బస్టాండ్‌లో, 2019 ఫిబ్రవరిలో డాక్టర్స్ కాలనీలో ఒక మహిలతో మాటలు కలిపి ఆమె వద్ద ఉన్న చేతి సంచిలోంచి రూ.50వేల నగదు, ఇదే ఏడాదిలో మార్చిలో బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న మహిల నుంచి బంగారు ఆభరణాలు అపహరించారని తెలిపారు. అదే విధంగా నల్లగొండ, హాలియా, సాగర్ బస్టాప్ వద్ద మహిళలు బస్సు ఎక్కుతుండగా పర్సు కొట్టేశారని తెలిపారు. మిర్యాలగూడలో దొంగిలించిన బంగారు ఆబరణాలను విక్రయించేందుకు వెళుతున్న క్రమంలో పట్టణంలోని గణేష్ మార్కెట్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుంచి 6.5 తులాల బంగారం, రూ.15వేల నగదు ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. మహిళా దొంగలను అరెస్టు చేయడంలో సహకరించిన ఎస్ఐ.రజిననీకర్, కుర్మయ్య, కానిస్టేబుల్ రవి, హోంగార్డు కిరణ్‌కుమార్‌లను అభినందించారు. -
మహిళా చైన్ స్నాచర్లకు కౌన్సెలింగ్
యాకుత్‌పురా(హైదరాబాద్): పోలీసులు చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వేలో గురువారం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు. వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన కైరున్నీసా (45)కు ఫౌజియా (19), మరో బాలిక (13)లు కూతుళ్లున్నారు. కైరున్నీసా గత కొన్ని నెలలుగా కూతుళ్లతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పిక్ ప్యాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సుల్తాన్‌బజార్‌లో రెండు, అఫ్జల్‌గంజ్‌లో రెండు, చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. నేరస్తుల సర్వేలో అదుపులోకి తీసుకున్న వీరిని విచారించి వదిలేశారు. -
గరీబ్ కా గోల్డ్
హైదరాబాద్: రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు ఓవైపు.. చైన్ స్నాచర్ల బెడద మరోవైపు.. దీంతో బంగారు నగలు దరించి బయటకు వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతామనే భరోస మహిళలకు లేకుండా పోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు పెళ్లిల్లకు వెళ్లాలంటే నగలు లేకుండా వెళ్లడం ఎలా..? ఈ ప్రశ్నకు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్న వన్‌గ్రాం గోల్డ్ నగలు సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని ఈ అభరణాలపై మగువలే కాక కళాశాల యువత కూడా మక్కువ చూపుతున్నారు. ఈ నగలను ధరిస్తే స్వచ్చమైన బంగారు నగలు దరించినట్టే ఉండడం వల్ల ఇవి ఇంతటి ఆదరణ పొందుతున్నాయి. ఈ వన్ గ్రాం గోల్డ్ నగలు నగరంలోని బేగం బజార్, చార్మినార్ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి.