ఐఐటీలో సీటు పొందడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కఠిన శ్రమ చేసి, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షల్లో గట్టి పోటీ ఇస్తే తప్ప ప్రవేశం సాధ్యం కాదు. అలాంటి పోటీని అధిగమించి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాంతంలోని ఆదివాసీ, గిరిపుత్రులు మెరుగైన ర్యాంకులు సాధించారు. వ్యవసాయమే జీవనాధారం, పేదరికం ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు మెరిశారు. కాలేజీల ఎంపికలో బిజీగా ఉన్న ర్యాంకులు పొందిన విద్యార్థులను పలకరించగా వారి ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, హైదరాబాద్
ఐటీడీఏ సహకారంతో ఈ స్థాయికి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కోరంపాడ్రి తండా మాది. ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని ఐటీడీఏ అధికారులు గుర్తించారు. వారి సహకారంతో స్థానిక కృష్ణవేణి పాఠశాలలో పదోతరగతి వరకు చదివా. టీటీడబ్ల్యూఆర్‌జేసీ– ఆదిలాబాద్‌లో సీటొచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌లో 1,061 ర్యాంకు సాధించా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తా. – పుర్క చిత్రు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుతా
వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం మాది. ముదూర్ మండలం ఎడ్‌బిడ్ తండా మా సొంతూరు. పదోతరగతి వరకు ముదూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని టీటీడ బ్ల్యూఆర్‌జేసీలో సీటు సాధించా. అక్కడ ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించి ప్రోత్సహించారు. కష్టపడి చదివి జేఈఈ అడ్వాన్స్‌లో 1,133 ర్యాంకు సాధించా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. – బదావత్ రాజేందర్
సివిల్ ఇంజనీరే నా లక్ష్యం
ఆదిలాబాద్ జిల్లా సొంతూరు ఉశెగాన్, జైనూరు మండలం. నాన్న వ్యవసాయం చేస్తారు. పదోతరగతి వరకు ఉట్నూ రులోని శిశు మందిర్‌లో చదువుకున్నా. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరా. పట్టుదలతో చదివి పరీక్షలు రాశా. ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్‌లో 1,618 ర్యాంకు వచ్చింది. ఇంజనీరింగ్‌లో సివిల్ బ్రాంచ్‌ను ఎంచుకుని సివిల్ ఇంజనీర్ అవుతా.
– కేరం నాగమణి
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా
మంచిర్యాల జిల్లా రెబ్బన మండలం నంబాల గ్రామం మాది. నాన్న వ్యవసాయ కూలి. ఫీజులు చెల్లించి చదువుకునే స్తోమత లేదు. పదోతరగతి వరకు నంబాల జెడ్పీ పాఠశాలలో చదివా. 7.7 మార్కులు వచ్చాయి. తర్వాత ఉట్నూరు టీటీడబ్ల్యూఆర్‌జేసీలో సీటు సాధించా. ఉపాధ్యాయుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌లో 2,315 ర్యాంకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా.
– పూదరి శ్రీనివాస్
ఆస్ట్రోనాట్ అవుతా..
ఆదిలాబాద్ జిల్లా సీహెచ్. ఖానాపూర్ మా సొంతూరు. ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నా. ఆదిలాబాద్‌లోని టీటీ డబ్ల్యూఆర్‌జేసీ లో చేరా. అక్కడే నాకు ఐఐటీపై అవగాహన కల్పించారు. పట్టుదలతో చదివి 2,509 ర్యాంకు సాధించా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఆస్ట్రోనాట్ అవుతా.
– జాదవ్ నిరంజన్
రూ.50 వేల నగదు, ల్యాప్‌టాప్..
ఐఐటీలో సీటు సాధించి న గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిం చింది. ఒక్కో విద్యార్థికి రూ.50 వేల నగదు, బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు.
– మంత్రి చందూలాల్
ప్రభుత్వ ప్రోత్సాహంతో
ఆదిలాబాద్ జిల్లా కౌటాల మం డలం ఇప్పలగూడ సొంతూరు. గిరిజన సంక్షేమ శాఖ సహ కారంతో ఆసిఫాబాద్‌లోని పీటీజీ స్కూల్‌లో పదోతరగతి వరకు చదు వుకున్నా. ఆదిలాబాద్‌లోని టీటీడ బ్ల్యూఆర్‌జేసీలో సీటొచ్చింది. అక్కడ జేఈఈ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. కష్టపడి జేఈఈ అడ్వాన్స్‌లో 2,594 ర్యాంకు సాధించా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తా.
– పూదరి ఆదర్శ్