చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం
Published Thu, May 11 2017 1:53 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైల్లో గురువారం ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జైలు అధికారుల వేధింపులు తాళలేక ఓ ఖైదీ ఇనుప కడ్డీలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. గడిచిన మూడు నెలల కాలంలో 12 మంది ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
Advertisement
Advertisement