
ఉద్యమ ఆశయాలు కార్యరూపం దాల్చాలి
తెలంగాణ పోరాటంలో గిరిజనుల పాత్ర ప్రశంసనీయం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనకు బలిదానమైన మొదటి వ్యక్తి భూక్యా అనే గిరిజనుడని, ప్రత్యేక రాష్ట్రం కోసం గిరిజనులు ఎంతో పోరాడారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం చెప్పారు. గిరిజనులకు అడవులపై ఉన్న హక్కులు, వారికి స్వపరిపాలనాధికారం కలిగిన పంచాయతీలను ఏర్పాటు చేయడం కోసం తనతో పాటు ఉద్యమ సహచరులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఉద్యమ ఆశయాలు ఇప్పుడిప్పుడే ఆచరణాత్మక ఫలితాలు ఇస్తున్నాయని.. అవి ఇంకా కార్యరూపం దాల్చాలన్నారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కోదండరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో ఉత్తమ ఫలితాలను సాధించిన 79 మంది ఎస్టీ విద్యార్థులకు కొమురం భీమ్ అవార్డులను, వారి టీచర్లకు సేవాలాల్ పురస్కారాలను ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అందజేశారు.