ప్రభుత్వానికి గురుకుల టీచర్ల నిబంధనలు | Residential teachers Conditions to the government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి గురుకుల టీచర్ల నిబంధనలు

Published Sun, Mar 19 2017 12:24 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

ప్రభుత్వానికి గురుకుల టీచర్ల నిబంధనలు - Sakshi

ప్రభుత్వానికి గురుకుల టీచర్ల నిబంధనలు

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్ల నియామకాల్లో అనుసరించాల్సిన నిబంధనలపై ప్రతిపాద నలను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గురుకుల టీచర్ల నోటిఫికేషన్‌లో చేయాల్సిన మార్పులపై ప్రభు త్వం ఏర్పాటు చేసిన కమిటీతో శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య సమావేశ మై చర్చించారు. డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించాలన్న నిబంధనను ఎత్తివేసినట్లు సమాచారం.

2010లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీ టీఈ) నిబంధనలు అమల్లోకి రాకముందు డిగ్రీ ఉంటే బీఎడ్‌లో ప్రవేశాలకు అవకాశం కల్పిం చారు. కానీ ప్రస్తుతం నిర్ణీత మార్కులు ఉండా లన్న నిబంధన కారణంగా వారంతా అవకాశం కోల్పోయే స్థితి ఏర్పడింది. ఎన్‌సీటీఈ నిబంధ నల ప్రకారం నిర్ణీత మార్కుల విధానం ఉండాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. డిగ్రీ, డీఎడ్‌ కలిగిన వారికి అవకాశం ఇచ్చే అంశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకో వాలని సూచించినట్లు తెలిసింది. వీటిపై మరోసారి సమావేశమయ్యాకే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement