
ఆర్‌బీఐ నుంచి రూ.30,900 కోట్లు
తాజాగా రాష్ట్రానికి రూ.1,500 కోట్ల నగదు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంకు మరో రూ.1,500 కోట్ల నగదును పంపిణీ చేసింది. దీంతో నోట్ల రద్దు నిర్ణయం అనంతరం తెలంగాణకు రిజర్వ్ బ్యాంకు పంపించిన మొత్తం రూ.30,900 కోట్లకు చేరింది. ప్రస్తుతం పంపించిన నగదులో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నా యని, వీటిని ఎక్కువగా ఏటీఎంల్లో అందుబాటులో ఉంచినట్లు బ్యాంకర్లు ప్రభుత్వానికి సమాచారం అందించారు. చిన్న నోట్లు పెరిగిన కొద్దీ నగదు కొరత తగ్గుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డిసెంబర్ చివరి వారంలో ఉన్న పరిస్థితితో పోలిస్తే రాష్ట్రమంతటా నగదు నోట్ల కొరత తీరిందని, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయనే అభిప్రాయానికి వచ్చింది. అందుకే టీఎస్ వ్యాలెట్ రూప కల్పన, డిజిటల్ చెల్లింపులను ఉద్యమంలా ప్రోత్సహించేందుకు మొదట్లో హడావుడి చేసిన ప్రభుత్వం క్రమంగా వెనక్కి తగ్గింది.