ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ | Rs 5 thousand per cent subsidy to onion farmers | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ

Published Thu, Mar 3 2016 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ - Sakshi

ఉల్లి రైతులకు రూ.5 వేల సబ్సిడీ

ప్రభుత్వానికి ఉద్యానశాఖ ప్రతిపాదన

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఎకరానికి రూ.5 వేల సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. ఈ మేర కు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు ఉల్లి సాగు చేసే రైతులకు రూ.5 వేలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తుండగా... మరో 10 హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉల్లి సాగు చేసే రైతులను గుర్తించారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చుచేస్తే కేవలం 6 టన్నుల ఉల్లి మాత్రమే పండుతోంది. దీంతో కొత్తగా విత్తనం తీసుకొచ్చారు. అది ఎకరానికి 12 టన్నుల దిగుబడి ఇస్తుంది. ప్రస్తుతం కిలో ఉల్లి ఉత్పత్తి చేయాలంటే రూ. 10 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement