రాజకీయ పార్టీగా ఆర్ఎస్పీ | rsp now political party election commition | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీగా ఆర్ఎస్పీ

Published Tue, Apr 12 2016 3:59 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

రాజకీయ పార్టీగా ఆర్ఎస్పీ - Sakshi

రాజకీయ పార్టీగా ఆర్ఎస్పీ

రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు
సాక్షి, హైద రాబాద్: రాష్ట్ర రాజకీయ పార్టీగా రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(ఆర్‌ఎస్పీ)ని గుర్తిస్తూ ఎన్నికల సంఘం రిజిష్టర్ చేసింది. ఎన్నికల గుర్తుగా స్పేడ్ అండ్ స్టోకర్(పారా, షావెల్)ను కేటాయించింది. తమ పార్టీ కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిందని, తెలంగాణలోనూ గుర్తింపు నివ్వాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొ. టీజే చంద్రచూడన్ దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ర్టంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీ బలపరిచే అభ్యర్థులకు పారా, షావెల్ గుర్తు కేటాయించేందుకు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు హర్షం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement