బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు బీభత్సం | rtc bus rams Vehicles at banjarahills care hospital | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Published Sat, Feb 27 2016 5:10 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

rtc bus rams Vehicles at banjarahills care hospital

హైదరాబాద్ : బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి సమీపంలో శనివారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బోరబండ నుంచి మెహదీపట్నం వెళుతున్న  ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మూడు కార్లు, ఆటో, ఓ బైక్ ధ్వంసం అయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. నాగార్జున సర్కిల్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement