![Bus Driver Causes Accident at Banjara Hills - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/3/Bus-Driver.jpg.webp?itok=FqOlcwZF)
సాక్షి, హైదరాబాద్: గత నెల 26న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సోహినీ సక్సేనా అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో తాత్కాలిక డ్రైవర్ శ్రీధర్‌ను అదే రోజు అరెస్టు చేశారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే కారణమని రవాణాశాఖ సెంట్రల్ జోన్ ఏఎంవీఐ మున్నీ నిర్ధారించారు. ఆమె సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదానికి కారణమైన బస్సును తనిఖీ చేశారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, బస్సు ఫిట్‌నెస్ బాగానే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు నివేదిక అందజేస్తామన్నారు.
కాగా, ప్రమాదం జరిగిన తర్వాత తాత్కాలిక డ్రైవర్ శ్రీధర్‌పై వాహనదారులు, స్థానికులు దాడి చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సును ధ్వంసం చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రభుత్వం నుంచి మృతురాలి కుటుంబానికి ఎటువంటి భరోసా లభించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. (స్కూటీని ఢీకొట్టి... శవాన్ని ఈడ్చుకెళ్లి..)
ప్రమాదానికి కారణమైన బస్సు
Comments
Please login to add a commentAdd a comment