బంజారాహిల్స్ : అతివేగం యువకుడి ప్రాణం తీసింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కడప జిల్లా జమ్మలమడుగుకు చెందినడంపిట్ల అవినాష్ యాదవ్(22), మయలూరి సుజన్‌కుమార్‌రెడ్డి(22) శనివారం ఉదయం 1.45కి ఏపీ 04 ఏఎన్ 7829 బైక్‌పై బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌వైపు వెళ్తున్నాడు. మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి వాహనం హెరి టేజ్ సూపర్‌మార్కెట్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అవినాష్ అక్కడికక్కడే మృతి చెం దగా.. బైక్ వెనుక కూర్చున్న సుజన్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు అపోలోకు తరలించారు. సుజన్‌కుమార్ రహేజా మైండ్‌స్పేస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుండగా ఉద్యోగం వెతుక్కుంటూ అవినాష్ యాదవ్ ఇక్కడికి వచ్చి స్నేహితులతో ఉంటున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బలిగొన్న అతివేగం
Published Sun, Nov 8 2015 10:25 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement