యాచారం, న్యూస్‌లైన్: ఇబ్రహీంపట్నం సమీపంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో సినీ హీరో అల్లు అర్జున్ సందడి చేశారు. శుక్రవారం కళాశాల వార్షికోత్సవ ముగింపు కార్యక్రమానికి వచ్చిన ఆయన గంటపాటు అభిమానులు, కళాశాల విద్యార్థులతో గడిపారు. బన్నితో ఫొటోలు దిగేందుకు వారంతా పోటీ పడ్డారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ యువత నచ్చిన వృత్తిని ఎంచుకొని రాణించాలన్నారు. అందరూ మొక్కలు నాటాలన్నారు.
చిన్నారులకు దుస్తుల పంపిణీ
మంచాల మండలం పటేల్‌చెర్వుతండాలోని అంగన్‌వాడీ చిన్నారులకు సెయింట్ ఇంజినీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. అల్లు అర్జున్ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేయించారు. త్వరలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గిరిజన తండాలో విద్యాభివృద్ధి, ఫ్లోరైడ్ నివారణకు చర్యలు తీసుకుంటానన్నారు.
రాష్ట్ర మైనారిటీస్ మాస్ మ్యారేజెస్ కమిటీ నియామకం
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి మైనారిటీస్ మాస్ మ్యారేజెస్ కమిటీని నియామిస్తూ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఒమర్ జలీల్ జీవో నెంబర్ 51 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో 11 మందిని నామినేట్ చేశారు. కన్వీనర్‌గా కమిషనర్ (మైనార్టీ సంక్షేమ శాఖ), సభ్యులుగా అల్తాఫ్ మహ్మద్‌ఖాన్ (హైదరాబాద్), జాఫర్ జావీద్ (హైదరాబాద్), ఫతర్‌బాల (సికింద్రాబాద్), షేక్ ముక్తార్ అహ్మద్ (హైదరాబాద్), రజాహుస్సేన్‌ఆజాద్ (హైదరాబాద్), హబీమ్ జైనుల్లా అబిద్ (హైదరాబాద్), షేక్ అబ్దుల్ ఉస్మాన్ (గుంటూరు), ఎం.మహ్మద్ పాషా (కర్నూలు), మీర్‌హుస్సేన్ (విజయవాడ), షేక్ అహ్మద్‌జియా (నిజామాబాద్)ను నియమించారు.