
27, 28 తేదీల్లో సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి ఆలోచిస్తున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు సాక్షి సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి ఆలోచిస్తున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేసేందుకు సాక్షి సిద్ధమైంది. శనివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ ఫెయిర్‌లో పలు ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ తదితర కోర్సుల కళాశాలలు పాల్గొననున్నాయి. విద్యార్థులు సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో పాల్గొనడం ద్వారా ఇంటర్ అనంతరం అందుబాటులో ఉన్న చక్కని కెరీర్ అవకాశాలపై అవగాహన పొందొచ్చు.
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతర కోర్సులు, కాలేజీలు, కెరీర్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల సందేహాలను సైతం నివృత్తి చేసేలా ఏర్పాటు చేస్తున్న సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ప్రత్యేకంగా కల్పించనున్న ఎంసెట్æ మాక్ కౌన్సెలింగ్ సదుపాయం ద్వారా ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో విద్యార్థులు ఒక అంచనాకు రావచ్చు. సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజెస్, హైదరాబాద్ ప్రధాన స్పాన్సరర్‌గా, భారత్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేట్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తున్నాయి.
వేదిక: వైట్ హౌస్, కొత్తపేట,దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్
సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
ప్రత్యేకత: ఎంసెట్ మాక్ కౌన్సెలింగ్ సదుపాయం;ఇంటర్ తర్వాత కెరీర్స్‌పై అవగాహన