‘సాక్షి’ చానల్ నిలిపివేతపై ఐజేయూ ఖండన | 'Sakshi' Channel Dropping On IJU intersection | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ చానల్ నిలిపివేతపై ఐజేయూ ఖండన

Published Fri, Jun 10 2016 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

'Sakshi' Channel Dropping On IJU intersection

తక్షణమే ప్రసారాలు పునరుద్ధరించాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని పలు జిల్లాల్లో గురువారం సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్య ప్రత్యక్షంగా భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె. అమరనాథ్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐ.వి.సుబ్బారావులు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రసారమాధ్యమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లకుండా నిలువరించే ప్రయత్నంలోనే సాక్షి టీవీ ప్రసారాలను అడ్డుకున్నట్లుగా ఐజేయూ భావిస్తోందన్నారు. తక్షణమే సాక్షి చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement