సాక్షి, హైదరాబాద్: పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సు ప్రవేశ పరీక్షలు ఈ నెల 28న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయని సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపల్ ఆర్.దిలీప్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌టికెట్లను sakshieducation.com, sakshischoolofjournalism.com వెబ్‌సైట్ల నుంచి బుధవారం ఉదయం 8 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.