గ్రేటర్ ఎన్నికలకు సైరన్ మోగడంతో జంట కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ అప్రమత్తమయ్యూరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యూరు.
నగరంలోని పరిస్థితులు బేరీజు వేయడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటానికి జంట కమిషనరేట్లలో ప్రత్యేక ఎలక్షన్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్‌కు అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
స్పెషల్ బ్రాంచ్ అదనపు సీపీ వై.నాగిరెడ్డి సైతం ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. సైబరాబాద్ ఎలక్షన్ సెల్‌కు సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన) టీవీ శశిధర్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి ఈయనకు సహకరిస్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నన్నాళ్ళూ నిత్యం ఓ డీఎస్‌ఆర్ (డెరుులీ సిట్యువేషన్ రిపోర్ట్) తయూరు చేసి కమిషనర్లకు నివేదించాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచ్‌లపై ఉంటుంది.
ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనుల ఇన్‌ఛార్జ్‌లతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవడం తదితర బాధ్యతలను ఎలక్షన్ సెల్స్ ఇన్‌చార్జ్‌లు నిర్వర్తిస్తారు. ఎన్నికల నామినేషన్లు మొదలుకుని ఫలితాలు ప్రకటించేంత వరకు ఈ విభాగాలు కొనసాగనున్నాయి.