శారీరక, మానసిక పరిణతి వచ్చాకే శృంగారం
శారీరక, మానసిక పరిణతి వచ్చిన తర్వాతే శృంగారానికి తగిన సందర్భమని వక్తలు అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి వివాహ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘శృంగారానికి అంగీకార వయస్సు’ అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం, తరుణి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు రాధిక, సెక్సాలజిస్టు డాక్టర్ భారతి, జర్నలిస్టు తేజస్విని, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు శృత కీర్తి, ఏపీబాలల హక్కుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అచ్యుత్‌రావు, విజయారెడ్డి, తరుణీ సంస్థ డెరైక్టర్ మమతా రఘువీర్, రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధి విజయలక్ష్మి, విశ్లేషకులు ప్రమీల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.