
అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ, హైదరాబాద్ అన్నిరంగాల్లో వెనుకబడిపోయాయని,
మంత్రి కేటీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ, హైదరాబాద్ అన్నిరంగాల్లో వెనుకబడిపోయాయని, టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు.
గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్ సిటీగా మార్చారన్నారు. మంత్రి కేటీఆర్ అభివృద్ధి అంతా మాటల్లోనే తప్ప చేతల్లో లేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేదన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో కాలు పెట్టనివ్వనని మంత్రి తలసాని అనడం సరికాదని, ఆయన ఇంటి ముందే సభ పెడతామని, దమ్ముంటే అడ్డుకోవాలన్నారు.