open discussion
-
అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి
మంత్రి కేటీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ, హైదరాబాద్ అన్నిరంగాల్లో వెనుకబడిపోయాయని, టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్ సిటీగా మార్చారన్నారు. మంత్రి కేటీఆర్ అభివృద్ధి అంతా మాటల్లోనే తప్ప చేతల్లో లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేదన్నారు. దిగ్విజయ్‌సింగ్‌ను హైదరాబాద్‌లో కాలు పెట్టనివ్వనని మంత్రి తలసాని అనడం సరికాదని, ఆయన ఇంటి ముందే సభ పెడతామని, దమ్ముంటే అడ్డుకోవాలన్నారు. -
కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
టీఆర్ఎస్ నేతలకు బీజేపీ సవాల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్ఎస్ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ సవాల్ విసిరింది. టీఆర్ఎస్ నేతలు సవాల్ స్వీకరిస్తే రూ.90 వేల కోట్ల నిధులకు సంబంధించిన వివరాలను తాము తీసుకొస్తామని ప్రకటించింది. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల హవా నడుస్తోందని, వారి మాటే చెల్లుబాటవుతోందని అన్నారు. ప్రజల తరఫున బీజేపీ గొంతు వినిపించే సరికి సహించలేకపోతోందన్నారు. గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా తీవ్ర అవస్థలకు గురిచేస్తోందన్నారు. హైకోర్టు విభజన సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్రాన్ని నిందిస్తోందన్నారు.