ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం గుర్తొస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు.
పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రమే సీఎం చంద్రబాబుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం గుర్తొస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. సోమవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే చల్లదనం కోసం సీఎంవిహార యాత్రకు స్విట్జర్లాండ్ వెళ్లడం బాధాకరమన్నారు. జిల్లాల పర్యటనల్లో చంద్రబాబు ఏ జిల్లాకు వెళ్తే అక్కడి సమస్యలపై చర్చించకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల రాయలసీమ కరువుతో ఎడారిగా మారే పరిస్థితి ఉన్నా చంద్రబాబు నోరెత్తకపోవడం దారుణమన్నారు. బాబు నిర్లక్ష్య థోరణికి వ్యతిరేకంగా ఈ నెల 23న విజయవాడ కృష్ణా బ్యారేజీ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించన్నుట్లు శైలజానాథ్ వెల్లడించారు.