
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని..సామాజికన్యాయం, సమానత్వంకోసం ముస్లిం మహిళలు చేస్తున్న పోరాటాలు ఈ బిల్లుతో ముగిశాయని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. ఎంఐఎం అధినేత ఒవైసీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ..అందరికీ సమన్యాయం కోసమే చట్టాలు కఠినతరం చేశామన్నారు. రాజకీయపార్టీలన్నీ ముస్లింలను ఓటుబ్యాంకుగానే చూశాయని..అదే పొరపాటును కొనసాగించకూడదనే కాంగ్రెస్ కూడా ట్రిపుల్ తలాక్ చట్టానికి మద్దతు ఇచ్చిందన్నారు.
2018 బీజేపీకి ఉద్యమాల సంవత్సరమని, పోరాటాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, భూసేకరణ వంటివాటిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment