‘ప్రత్యేక హోదా’ చంద్రబాబుకు ఇష్టం లేదు | 'Special status' do not like to Chandrababu | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక హోదా’ చంద్రబాబుకు ఇష్టం లేదు

Published Wed, May 18 2016 1:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘ప్రత్యేక హోదా’ చంద్రబాబుకు ఇష్టం లేదు - Sakshi

‘ప్రత్యేక హోదా’ చంద్రబాబుకు ఇష్టం లేదు

 పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం ఆరోపణ

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సీఎం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేనట్లుగా కన్పిస్తోందని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం ఆరోపించారు. మంగళవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన బాబు.. ప్రత్యేక హోదా డిమాండ్‌పై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదం తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలను బలపరచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి కరువు సాయం అందించాలని, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలిపివేయాలని, ఖరీఫ్ ముందస్తు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో 20న పీసీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement