కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Kacheguda-Kakinada | Sakshi
Sakshi News home page

కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

Published Wed, Apr 26 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

కాచిగూడ–కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సాక్షి, హైదరాబాద్‌: వేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ–కాకినాడ, కాచిగూడ– కృష్ణరాజపురం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాచిగూడ–కాకినాడ (07425/07426) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 28, మే 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయా ణంలో ఈ నెల 29, మే 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 5.50కి కాకినాడ నుంచి బయలుదేరి మరు సటి రోజు ఉదయం 5.10కి కాచిగూడ చేరుకుంటుంది.

కాచిగూడ–కృష్ణ రాజపురం (07603/07604) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 30, మే 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 6గంటలకు కాచి గూడ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కృష్ణరాజపురం చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో మే 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 10.30కు కృష్ణరాజపురం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు కాచిగూడ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement