లక్ష కి పది వేల రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆశ చూపించి అమాయకులను బురిడి కొట్టించి సుమారు రూ. 4కోట్ల రూపాయలతో ఉడాయించిన వ్యాపారిపై ఫిర్యాదు నమోదైంది.
హైదరాబాద్: లక్ష కి పది వేల రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆశ చూపించి అమాయకులను బురిడి కొట్టించి సుమారు రూ. 4కోట్ల రూపాయలతో ఉడాయించిన వ్యాపారిపై ఫిర్యాదు నమోదైంది. ఎస్ స్మార్ట్ సంస్థ, ఏఆర్ రాయల్ ఫర్నీచర్ యాజమాని అబ్దుల్ రెహమాన్(35) పై ముగ్గరు బాధితుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. రెహమాన్ బాదితులు 100 మంది ఉంటారని అంచనా.