కేంద్రం నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ అధికారుల వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ 1997 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సయ్యద్‌అన్వరుల్ హుడా, టి.పి.దాస్‌లు గురువారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అధికారుల కేటాయింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేయకుండా.. కేవలం రాష్ట్ర నోటిఫికేషన్‌ను సవాలు చేయడం సరికాదంటూ గత విచారణ సమయంలో తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి అభ్యంతరాలు లేవనెత్తిన సందర్భంలో, వారు ఈ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్రం పది రోజుల్లో వివరాలివ్వాలి
ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏ ప్రతిపాదికన ఐపీఎస్ అధికారులను కేటాయించారో, అందుకు అనుసరించిన విధానం ఏమిటో చెప్పాలని ఆదేశాలు జారీ చేసి వారందాటినా కూడా కేంద్రం ఎటువంటి వివరాలు అందచేయకపోవడంపై క్యాట్ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పది రోజుల్లో తాము కోరిన వివరాలను తమ ముందుంచి తీరాలని కేంద్రానికి హుకుం జారీ చేసింది. ఒకవేళ పది రోజుల్లో వివరణ రాని పక్షంలో తాము తుది విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్‌ల కేటాయింపులపై క్యాట్‌లో అనుబంధ పిటిషన్
Published Fri, Jul 4 2014 2:42 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM
Advertisement