శంషాబాద్: మద్యం మత్తులో ఎయిర్‌పోర్టులోని నిషేధిత ప్రాంతంలోకి దూకిన ఓ వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కశ్యప్(25) ఆదివారం సాయంత్రం మండలంలోని గొల్లపల్లి గ్రామం వైపు వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు.
మత్తులో ఉన్న అతడు అదే రహదారి పక్కనే ఉన్న విమానాశ్రయానికి చెందిన ప్రహరీని ఎక్కి కిందికి దూకాడు. గమనించిన సీఐఎస్‌ఎఫ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో కశ్యప్ వివరాలు చెప్పలేదు. అతడి స్నేహితుల ద్వారా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు విచారణలో ఉంది.
విమానాశ్రయంలో అనుమానితుడి అరెస్ట్
Published Sun, Apr 10 2016 10:08 PM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Advertisement